Train Accident: విషాదం.. పండ్లు తింటుండగా, పిల్లలపై దూసుకెళ్లిన ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 children Crushed To Death By Train In Punjab Kiratpur Sahib: పంజాబ్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై సరదాగా ఆడుకుంటూ, పండ్లు తింటుండగా.. వారిపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం కిరత్‌పుట్ సాహిబ్‌లో సుల్తేజ్ నదిపై నిర్మించిన లోహంద్ రైల్వే బ్రిడ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటన గురించి అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ జగ్‌జీత్ సింగ్ మాట్లాడుతూ.. నలుగురు పిల్లలు చెట్ల నుంచి పండ్లు కోసుకొని, రైలు పట్టాలపై కూర్చొని తింటున్నారని, అదే సమయంలో రైలు రావడంతో వాళ్లు మృతి చెందారన్నారు. తమవైపు రైలు రావడాన్ని ఆ పిల్లలు గమనించలేదన్నారు. అందుకే ఈ ప్రమాదం సంభవించిందన్నారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు స్పాట్‌లోనే చనిపోయారని, మరొక బాలుడు ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు మార్గంలోనే శ్వాస విడిచారని జగ్‌జీత్ తెలిపారు. నాలుగో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. సహరన్‌పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్తున్న రైలు.. కిరత్‌పుత్ సాహిబ్‌కి చేరుకున్నప్పుడు ఈ ఘటన సంభవించిందని అన్నారు. ఈ యాక్సిడెంట్ తర్వాత రైలు నిలిచిపోయిందని, గాయపడిన వారిని ఆనంద్‌పర్ సాహిబ్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే.. ఒక బాలుడు మార్గమధ్యంలోనే చనిపోయాడని వెల్లడించారు. ఇదిలావుండగా.. ఆడుకోవడానికి వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో, వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
మరోవైపు.. ఈ ఘటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్విటర్ మాధ్యమంగా స్పందించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించిన ఆయన.. వారికి తగిన పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన తనని తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!