మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్‌లో ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) దూరపు బంధువులకు రిజర్వేషన్లు కల్పించడం మోసమని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది. ఇది మోసమని, దీన్ని అరికట్టాలని చూచించింది. మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటాను పెంచాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఆర్‌ఐల దూరపు బంధువులకు అడ్మిషన్‌లో రిజర్వేషన్ ప్రయోజనం కల్పించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.…
పంజాబ్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రభుత్వానికి గురువారం రూ.1026 కోట్ల జరిమానా విధించింది. పాత వ్యర్థాలు, మురుగునీటి విసర్జన నిర్వహణపై ఖచ్చితమైన చర్యలు తీసుకోనందుకు పంజాబ్ ప్రభుత్వంపై ఎన్జీటీ ఈ జరిమానా విధించింది.
Pakistan : పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం శుక్రవారం ఓ అధికారిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులకు, ఆర్మీ సిబ్బందికి మధ్య కొనసాగుతున్న వివాదంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించాయి.
Rat Glue Pad: ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల తర్వాత ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం కూడా ఎలుకలను ట్రాప్ చేసే గ్లూ పేపర్ బోర్డులను నిషేధించాలని నిర్ణయించింది. పంజాబ్‌లో దీని తయారీ, అమ్మకం, వినియోగం నిషేధించబడింది.
నెల రోజుల పాటు వెంబడించిన తర్వాత పంజాబ్‌లోని మోగాలో ఆదివారం ఉదయం అరెస్టయిన ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అతని భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై నిఘా పెట్టినప్పటి నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ల్యాండ్ డీల్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబర్ట్ వాద్రా సంస్థ రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు భూమిని బదలాయించడంలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ ప్రభుత్వానికి తెలిపింది.
పంజాబ్‌లో తుపాకీ సంస్కృతిపై అణిచివేత కొనసాగిస్తూ భగవంత్-మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం 813 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేసింది. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది.