బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. సర్వే ఫలితాలకు అనుకూలంగానే ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రస్తుతం 171 స్థానాల్లో అధికార కూటమి లీడ్‌లో ఉంది.
బీహార్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు ఎవరికి వారే గంపెడాశలు పెట్టుకున్నాయి. సర్వే ఫలితాలు అధికార కూటమికే అనుకూలంగా ఉన్నా.. విపక్ష కూటమి కూడా ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెబుతోంది.
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్‌తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్‌కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమీపం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ తన అభ్యర్థుల రెండో లిస్టును రిలీజ్ చేశాయి. 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించిన జానపద గాయని మైథిలి ఠాకూర్ పేరు కూడా సెకండ్ లిస్టులో ఉంది. ఆమె రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరింది. మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్‌లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్‌గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.