జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన కోట్రాంకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మందిర్ గాలా పైన ఉన్న ధేరి ఖతుని ప్రాంతంలో జరిగింది. నివేదికల ప్రకారం, రాత్రి 7:20 గంటల సమయంలో ఆ ప్రాంతంలో 10 నుండి 15 రౌండ్ల కాల్పులు వినిపించాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న జమ్మూ, కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు…
Jammu Kashmir: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు త్రాల్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది.
Encounter: జమ్మూ కాశ్మీర్ కథువాలో ఉగ్రవాదుల చొరబాటును భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు! ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు…
Encounter: జమ్మూ కాశ్మీర్ మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. బారాముల్లా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. బారాముల్లాలోని సోపోర్ సెక్టార్‌లో భద్రతా దళాలు కార్డర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో ఇటీవల ఉగ్రవాదులు ఇద్దరు విలేజ్ గార్డుల్ని చంపేశారు. అయితే, ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటన వెనక ఉన్న నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కార్నర్ చేశాయి. వీరిని తుదముట్టించేందుకు భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు మరో జవాన్ గాయపడ్డారు.
జమ్మూకాశ్మీర్‌లోని కతువాలో జైషే ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. కతువాలోని బిలావర్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. శనివారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. గత 24 గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ముగ్గురు సైనికులు మొత్తంగా ఐదుగురు వీరమరణం పొందారు. గురువారం కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరణించిన వారి ఫోటోలు పేర్లను ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు.
Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌లో గత 24 గంటలుగా ఎన్‌కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్‌కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు.
Kulgam Encounter : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ గురువారం నుండి ప్రారంభమైంది. ఇది పెద్ద విజయాన్ని సాధించింది.