Reels On Railway Track: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ప్రాణాలను తీస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో వీడియోల షూట్ చేస్తుండటం, సెల్ఫీలు దిగుతుండటం యువత ప్రాణాలను తీస్తోంది. మహరాష్ట్రలోని నాసిక్‌లో ఇలాగే ఇద్దరు యువకులు మరణించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై నిలుచున్న సమయంలో రైలు ఢీకొట్టిందని రైల్వే పోలీసు (జిఆర్‌పి) అధికారి ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం వల్దేవి నంది వంతెన సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించారు.
Read Also: Simran Choudhary: సారధి స్టూడియోలో ఘనంగా ప్రారంభమైన సిమ్రాన్ చౌదరి కొత్త సినిమా!
బాధిత యువకులును సంకేత్ కైలాస్ రాథోడ్, సచిన్ దిలీప్ కార్వాన్ ట్రాక్‌పై రీల్స్ షూట్ చేస్తూ, సెల్ఫీలు దిగుతున్నారని వారి వెనక నుంచి వచ్చే రైలుని గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారి వెల్లడించారు. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారని, ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరణించిన ఇద్దరూ డియోలాలి క్యాంప్‌లోని భాటియా కళాశాల విద్యార్థులు. ఇటీవలే 11వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని అధికారి వెల్లడించారు.