మెహుల్ చోక్సీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను బెల్జియం అప్పీలేట్ కోర్టు మరోసారి తిరస్కరించింది. కోర్టులో అతని అప్పగింత విచారణకు కొద్దిసేపటి ముందు ఈ పిటిషన్ తిరస్కరించబడిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను మరోసారి…
Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి (పీఎన్‌బీ) వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతడిని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈయన మాదిరిగానే మరి కొందరు కూడా బ్యాంకులను మోసం చేసిన విదేశాలకు పారిపోయారు. వారి గురించి ఒక్కొక్కరిగా…
Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. ఆయనను భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ..
Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)ని రూ. 12,636 కోట్ల మోసం చేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఆర్థిక నేరస్తుడిని భారత్ దేశానికి తీసుకువచ్చేందుకు మన సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు 8 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, భారత్ అప్పగింత అభ్యర్థన మేరకు బెల్జియంలో అదుపులోకి తీసుకున్నారు.
Mehul Choksi: ఆర్థిక నిందితుడు మెహుల్ చోక్సీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. భారత్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు బెల్జియంలో అతడిని అరెస్ట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ని మోసం చేసి వేల కోట్లు అప్పుగా తీసుకుని, ఇండియా నుంచి పరారయ్యాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అభ్యర్థన మేరకు 65 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉన్నాడని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం నిర్ధారించింది. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అతని ఆచూకీ తెలిపింది. ఇక వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నారు.
13 వేల కోట్ల మోసానికి సంబంధించి భారత్‌లో వాంటెడ్‌గా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఆంటిగ్వా, బార్బుడా నుండి తొలగించలేమని ఆదేశ హైకోర్టు తెలిపింది. చోక్సీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Mehul Choksi: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఇండియాలో పలు బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు పారిపోయారు. అయితే అప్పటి నుంచి అతడిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కు పాల్పడిన మెహుల్ చోక్సీ 2018లో దేశం వదలి పారిపోయాడు. ఇతడిపై ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉంటే మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో ఉన్న ఆయన…
భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో…