Bengal Waqf Violence: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. నిరసనల పేరుతో హిందువుల ఇళ్లను, ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారుల్ని కోరినప్పటికీ సమస్య సద్దుమణగడం లేదు. వక్ఫ్ బిల్లును రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ఆందోళనకారులకు చెప్పారు. అయినప్పటికీ, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘వక్ఫ్ బిల్లును మా పార్టీ వ్యతిరేకించింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోండి’’ అని మమతా బెనర్జీ ఆందోళనకారులకు చెప్పింది.
ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉత్తర బెంగాల్‌లో ఉన్న ముర్షిదాబాద్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వక్ఫ్ ఆందోళన పేరుతో కొన్ని ముస్లిం మూకలు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పంటించారు. జిల్లాలోని సుతి, ధులియన్, జంగీపూర్ ప్రాంతాల్లో తీవ్ర హింస చెలరేగింది. జిల్లాలోని రైల్వే స్టేషన్‌పై అల్లరిమూకలు దాడులు చేసి, కంట్రోల్ రూంని ధ్వంసం చేశాయి. ఉద్యోగులు వాహనాలను తగులబెట్టారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 150 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !
మరోవైపు, ప్రభుత్వ తీరుపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని శనివారం కోర్టు పేర్కొంది. కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది.అల్లర్లలో మతోన్మాదులు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. వారి వ్యాపారాలు, ఇళ్లను లూఠీ చేస్తున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు. తండ్రికొడుకులల్ని అల్లర్లలో పాల్గొన్న వారు నరికి చంపారు. మరోకరు బుల్లెట్ గాయాల వల్ల చనిపోయారు.
బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. 400 మందికి పైగా హిందువులు తమ ఇళ్లను వదిలిపెట్టాల్సి వచ్చిందని అన్నారు. ‘‘బెంగాల్‌లో మతపరమైన హింస వాస్తవం. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాల వల్ల తీవ్రవాద శక్తులు బలపడుతున్నాయి. హిందువుల్ని వేటాడుతున్నారు. మన ప్రజలు తమ సొంత భూమిలో ప్రాణాల కోసం పారిపోతున్నారు’’ అని ఆయన అన్నారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కలకత్తా హైకోర్టు తీర్పును స్వాగతించారు.
ముస్లిం ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్ జిల్లాలో ఏప్రిల్ 08న హింస ప్రారంభమైంది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పంటించారు. కోల్‌కతా, మాల్దా, హౌరాలో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి గుండాయిజాన్ని సహించదని, ప్రజా ఆస్తులు విధ్వంసమయ్యాయని, ఇది మతపరమైన కోణంలోకి వెళ్లిందని ఆయన అన్నారు.