అనిమేషన్ మూవీస్ ఎన్ని వచ్చినప్పటికి. కొని జంతువుల సినిమాలు మాత్రం అసలు బోర్ కొట్టవు. ఎన్ని రకాలుగా వస్తే అన్ని రకాల సినిమాలు చూస్తునే ఉంటాం. కానీ 2021లో వచ్చిన ‘పాడింగ్టన్ ఇన్ పెరూ’ , 2017 లో వచ్చిన ‘పాడింగ్టన్ 2’ వంటి చిత్రాలు చరిత్రలో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఇక పాడింగ్టన్ సిరిస్ నుండి మూడో భాగం రాబోతుంది. డౌగల్ విల్సన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా 2025 ఏప్రిల్ 18న భారతీయ సినిమా థియేటర్లలో ప్రత్యేకంగా విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ ప్రసిద్ధ కుటుంబ వినోదం.. మూడవ భాగం నుండి ట్రైలర్ విడుదల చేశారు.
Also Read: Puri Jagannadh : విజయ్ సేతుపతి- పూరి సినిమాలో బాలయ్య హీరోయిన్..
కాగా ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. సాహసం, రహస్యాలతో నిండి, ప్రేమగల ఎలుగుబంటి అత్త లూసీ అలాగే ఎల్ డొరాడోలను వెతుకుతూ ప్రమాదకరమైన అడవులు, అస్థిర నదులు, పురాతన శిధిలాల గుండా ప్రయాణిస్తుంది. కాగా మొదటి రెండు చిత్రాల కంటే ఈ మూడో భాగం మరింత ఇంట్రెస్ట్ గా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.