Bengal Violence: గత కొన్ని రోజులుగా బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో హింస తీవ్రంగా మారింది. ఆందోళనకారుల ముసుగులో పలువురు అల్లర్లకు పాల్పడ్డారు. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు వల్లే ఇలాంటి అల్లర్లు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. 150 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengal Waqf Clashes: బెంగాల్ వక్ఫ్ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో భారీగా అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. చాలా మంది హిందువులు ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tarun Chugh: బెంగాల్‌లో వక్ఫ్ వ్యతిరేక అల్లర్లపై మమతా బెనర్జీ ఏం చేయడం లేదని ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది. హింసకు మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలే కారణమని ఆరోపిస్తోంది. బెంగాల్‌లో ముఖ్యంగా ముర్షిదాబాద్‌లో జరిగిన వక్ఫ్ వ్యతిరేక నిరసనల్లో హింస చోటు చేసుకుంది.
Bengal Waqf Violence: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. నిరసనల పేరుతో హిందువుల ఇళ్లను, ఆస్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారుల్ని కోరినప్పటికీ సమస్య సద్దుమణగడం లేదు. వక్ఫ్ బిల్లును రాష్ట్రంలో అమలు చేయమని ఆమె ఆందోళనకారులకు చెప్పారు. అయినప్పటికీ, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ‘‘వక్ఫ్ బిల్లును మా పార్టీ వ్యతిరేకించింది. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోండి’’…
Bengal Waqf Violence: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో హింస పెరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిరసనకారులు ఇద్దరు తండ్రికొడుకులను నరికి చంపారు. ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.