Dogs Attack: జవహర్ నగర్ పరిధిలోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల వీరంగం సృష్టించాయి.ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్ పై విచక్షణారహితంగా దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై ఆరు వీధికుక్కలు దాడి చేయడంతో గాయపడిన ఘటన సంగారెడ్డిలో కలకలం రేపింది. స్థానికులు హుటాహుటిన చిన్నారిని రక్షించారు. ఈ సంఘటన యొక్క CCTV ఫుటేజ్, ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది, కుక్కలు పిల్లవాడిపై దాడి చేసిన భయంకరమైన క్షణాన్ని సంగ్రహించింది. సహాయం కోసం బాలుడి కేకలు వేయడంతో, నివాసితులు కుక్కలను కొట్టడానికి , తరిమికొట్టడానికి రాళ్లను ఉపయోగించారు. వారు వేగంగా చర్యలు తీసుకున్నప్పటికీ, బాలుడికి తీవ్ర గాయాలు…
Stray Dogs Attack: పంజాబ్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళపై దాదాపుగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక సుల్తాన్ పూర్ లోధిలో మహిళ పశువుల్ని మేపేందుకు పొలాల్లోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
Stray Dogs Attack: విధికుక్కులు చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయి. ఇటీవల పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఏడు నెలల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి ప్రాణం తీశాయి. ఈ ఘటన బుధవారం నగరంలోని అయోధ్య నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనను పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.
Dog Attack: వీధికుక్కల దాడులు దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ఘటనలు నమోదయ్యాయి. వీధికుక్కల దాడుల్లో చిన్నారు, పెద్ద వయసు ఉన్న వారు మరణిస్తున్నారు. వీరే ఈజీగా వాటికి టార్గెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రంలో నీల్మబూర్ లో మంగళవారం ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఎల్‌కేజీ చదువుతున్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుందగా మూడు వీధికుక్కలు దాడి చేశాయి.
12-year-old boy mauled to death by stray dogs: అభం శుభం తెలియని చిన్నారుల పాలిట మృత్యవుగా మారుతున్నాయి కుక్కలు. పిల్లలే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు వీరికి ఈజీ టార్గెట్ అవుతున్నారు. దేశంలో రోజుల వ్యవధిలో ఎక్కడో చోట కుక్కల దాడులు వెలుగులోకి వస్తున్నాయి. మున్సిపల్ సిబ్బంది అసలు వీటి గురించి పట్టించుకోవడమే లేదు. ఇదిలా ఉంటే వీధికుక్కల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ బాలుడిని చంపేశాయి.
Dogs Attack: ఇటీవల దేశంలో చాలా ప్రాంతాల్లో కుక్కల దాడులు జరుగుతున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా కుక్కల దాడులకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు వీటికి ఈజీగా టార్గెట్ అవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో మార్నింగ్ వాక్ వెళ్లిన ఓ వ్యక్తిపై దాడి చేసి చనిపోయే వరకు కరిచి చంపాయి. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…
Stray Dogs Attack: కుక్కల దాడుల్లో అమాయకపు పిల్లలు దారుణంగా మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కుక్కల దాడుల వల్ల చాలా మంది మరణించారు. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ ప్రాంతంలో వీధికుక్కల దాడుల్లో 11 ఏళ్ల బాలుడు బలయ్యాడు. మహారాజ్‌గంజ్‌లోని శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ కళాశాల మైదానంలో 11 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కొట్టి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.