రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ శ్రీకృష్ణుడి ఆలయానికి భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. ఆలయ అధికారులే షాక్ అయ్యేలా విరాళాలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆలయంలో రెండు నెలల తర్వాత అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా కిలో బంగారు బిస్కెట్లు, రూ.23 కోట్లకు పైగా నగదు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Volkswagen Cars: కారు కొనేవారికి శుభవార్త.. ఈ కారుపై భారీ తగ్గింపు ధరలు
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో కృష్ణ భగవానుడికి అంకితం చేయబడిన ప్రఖ్యాత ఆలయం ఇది. తమ కోర్కెలు నెరవేరుతాయన్న ఆశతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే వచ్చిన భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఈసారి ఎన్నడూ లేనంతగా అపూర్వమైన కానుకలు రావడం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. రెండు నెలల తర్వాత హుండీ లెక్కించగా.. కిలో బంగారు బిస్కెట్లు, వెండి కళాఖండాలు, వెండి పిస్టల్, వెండి తాళం-కీ, వేణువులు వంటి ప్రత్యేకమైన వస్తువులు, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఆలయం ప్రారంభం తర్వాత ఇంత మొత్తంలో కానుకలు రావడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. బంగారం, వెండి వస్తువులు, హుండీల నుంచి సేకరించిన వివిధ వస్తువులను తూకం వేసి వాటి విలువను లెక్కకట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Pragya Nagra leaked Video: టాలీవుడ్ హీరోయిన్ వీడియోలు లీక్
చిత్తోర్‌గఢ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్‌గఢ్-ఉదయ్‌పూర్ హైవేపై ఉన్న ఆలయం వైష్ణవ భక్తులకు కీలకమైన పుణ్యక్షేత్రం. సంవత్సరాలుగా ఈ ఆలయం అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది. స్థానిక విశ్వాసాల ప్రకారం ప్రఖ్యాత హిందూ కవయిత్రి మరియు ఆధ్యాత్మికవేత్త మీరాబాయి కూడా ఈ ఆలయంలో ప్రార్థనలు చేసినట్లుగా చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Mamta Kulkarni: 25 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన అలనాటి బాలీవుడ్ నటి మమత.. భావోద్వేగంతో కంటతడి