Lawrence Bishnoi: ఇటీవల కాలంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇండియాలో పాటు కెనడాలో ఈ పేరు చాలా ఫేమస్ అయింది. సాక్ష్యాత్తు కెనడా ప్రభుత్వం,ప్రధాని లారెన్స్ బిష్ణోయ్‌కి, ఇండియా దౌత్యవేత్తలకు సంబంధం ఉందని ఆరోపించాడు. మరోవైపు సల్మాన్ ఖాన్‌కి అత్యంత సన్నిహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్యలో కూడా బిష్ణోయ్ పేరు బయటకు వచ్చింది.
ఇదిలా ఉంటే, జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్ స్టర్‌ని ‘‘ఎన్కౌంటర్’’ చేస్తే రూ. 1,11,11,111 నగదు బహుమతి ఇస్తామని క్షత్రియ కర్ణిసేన ఆఫర్ ప్రకటించింది. గతేడాది డిసెంబర్ నెలలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ కారణమని కర్ణిసేన నాయకుడు రాజ్ షెకావత్ అన్నారు. అందుకే అతడి హత్యకు నగదు బహుమతి ప్రకటించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్‌ని చంపిన ఏ పోలీస్ అధికారికైనా ఈ అవార్డు ఇస్తానని రాజ్ షెకావత్ ప్రకటించడం చూడొచ్చు.
Read Also: IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. మహ్మద్ సిరాజ్‌పై వేటు!
క్రాస్ బార్డర్ గ్రడ్స్ స్మగ్లింగ్ కేసులో బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఇటీవల బాబా సిద్ధిక్ హత్య కేసులో ఇతడి గ్యాంగ్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిష్ణోయ్ కమ్యూనిటీకి అత్యంత పవిత్రమైన కృష్ణ జింకలను చంపాడనే కేసులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ హత్యకు పలుమార్లు ప్రయత్నించాడు.
ఇదిలా ఉంటే, గతేడాది రాజ్ పుత్ నాయకుడు గోగమేడి జైపూర్‌లో తన ఇంట్లో ఉన్న సమయంలో పట్టపగటు కాల్చి చంపారు. ఇద్దరు వ్యక్తులు అతడిని చంపారు. ఈ ఫైరింగ్‌లో షూటర్లలో ఒకరైన నవీన్ సింగ్ షెకావత్ కూడా మరణించాడు. దాడి జరిగిన కొద్దిసేపటికి.. లారెన్స్ బిష్ణోయ్ మరియు గోల్డీ బ్రార్ గ్యాంగ్‌ల సహచరుడు రోహిత్ గోదారా, మిస్టర్ గోగమేడి హత్యకు బాధ్యత వహించాడు. సోషల్ మీడియా పోస్టు ద్వారా ‘‘నేను రోహిత్ గోదార కపుర్సారిని, గోల్డీ బ్రార్ సోదరుడిని. సుఖ్‌దేవ్ గోగమేడి హత్యకు పూర్తి బాధ్యత వహిస్తున్నాము. అతను మా శత్రువులకు సహకరించాడు.’’ అని పేర్కొన్నాడు.
ఈ హత్య రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజ్‌పుత్ కమ్యూనిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. ఈ హత్యలో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ పోలీసులు కీలక నిందితుడు అశోక్ మేఘవాల్‌తో పాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. హత్యకు సూత్రధారి రోహిత్ గోదార పరారీలోనే ఉన్నాడు. గోదార పవన్ కుమార్ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్ ఉపయోగించి భారత్ నుంచి పారిపోయాడు. కెనడాలో ఎక్కడో చోట తలదాచుకున్నట్లు తెలుస్తోంది.