రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఖతీపురాలోని రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించారని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్‌తో కొట్టివేసింది.
Rajasthan : శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు నిరసనగా ఈరోజు రాజస్థాన్ బంద్‌కు పిలుపునిచ్చారు. జైపూర్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో బంద్ విస్తృత ప్రభావం చూపింది.
Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.