Anmol Bishnoi: అమెరికా నుంచి ఇండియాకు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను రప్పిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్. ఈ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌ను అమెరికా బహిష్కరించింది. ఈ విషయాన్ని బాబా సిద్ధిఖీ కుమారుడు, మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు. బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. అలాగే అన్మోల్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పూర్ణియా…
Baba Siddique Murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖ్ హత్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ హత్యలో ప్రధాన షూటర్ శివకుమార్‌ని ఆదివారం అరెస్ట్ చేశారు.
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్యలో మరో అరెస్ట్ జరిగింది. హత్య కోసం షూటర్లకు ఆయుధాలు అందించిన స్క్రాప్ డీలర్‌ని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులు ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్ చేయబడ్డారు. నిందితుడిని రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన భగవత్ సింగ్ ఓం సింగ్ (32)గా గుర్తించారు, అతను ప్రస్తుతం నవీ ముంబైలో ఉంటున్నాడు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచగా..…
Baba Siddique Murder: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్‌ని ముంబైలోని బాంద్రాలో కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. తామే ఈ హత్యకు పాల్పడినట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Salman Khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యను తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే ఇతడిని చంపేసినట్లు సోషల్ మీడియా పోస్టులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద భద్రతను పెంచారు. ఈ ప్రాంతం చుట్టూ భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 60 మంది…
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఈ హత్యకు బాధ్యత ప్రకటించింది. సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీంకి మద్దతుగా ఉండటంతోనే హత్య చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పతనమయ్యాయని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ హత్యని తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మొత్తం ఘటన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌తో ముడిపడి ఉంది. సల్మాన్ ఖాన్‌కి ఎవరైనా సాయం చేస్తే,వారికి సిద్ధిక్ గతి పడుతుందని హెచ్చరించింది.