Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.
‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’…
అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్…