ఈరోజు ఇండియన్ ఫిల్మ్ లవర్స్ కి ఫుల్ మీల్స్ డే అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్’ అవార్డుని గెలుచుకోవడం, ఎన్టీఆర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ కి చేరుకున్న మొదటి ఇండియన్ గా హిస్టరీ క్రియేట్ చెయ్యడం, రామ్ చరణ్ లాస్ ఏంజల్స్ కి ప్రయాణం అవుతూ ఎయిర్పోర్ట్ లో కనిపించడం… ఇలాంటి విషయాలతో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ‘వెరైటీ మ్యాగజైన్’ ఎన్టీఆర్ గురించి ఆర్టికల్ పబ్లిష్ చెయ్యడంతో నందమూరి అభిమానులు #ManofMasses ట్యాగ్ ని క్రియేట్ చేసి టాప్ ట్రెండింగ్ లో పెట్టారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ బ్లాక్ టీషర్ట్ లో ఉన్న ఒక ఫోటో కూడా బయటకి వచ్చింది. ఇంకేముంది అగ్నికి ఆజ్యం పోసినట్లు ఎన్టీఆర్ ఫాన్స్ మరింత జోష్ తో #ManofMasses ట్రెండ్ లో ట్వీట్స్ చేస్తున్నారు. బ్లాక్ టీషర్ట్ లో ఎన్టీఆర్, ఫుల్ గడ్డం పెంచుకోని రగ్గడ్ లుక్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
Read Also: NTR: ఒక ఇండియన్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ టాప్ 10లో ఉండడం ఇదే మొదటిసారి…
కొరటాల శివతో చేయన్నున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ 30’ కోసమే ఎన్టీఆర్ రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. సముద్రం నేపధ్యంలో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 30’ ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ‘జాన్వీ కపూర్’ హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు కాబట్టి ఎన్టీఆర్ పక్కన జాన్వీ కపూర్ నటిస్తుంది అనే వార్త ప్రస్తుతానికి రూమర్ గానే మిగిలింది. మరి త్వరలో ‘ఎన్టీఆర్ 30’ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి కాబట్టి ఆ రోజు హీరోయిన్ విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇప్పటికైతే ఎన్టీఆర్ ఫారిన్ నుంచి తిరిగొచ్చేలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చెయ్యాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. జనవరి 9న TCL చైనీస్ ధియేటర్ లో జరగనున్న ‘ఆర్ ఆర్ ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నాడు.