టెంపర్ సినిమా ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లడుతూ “నందమూరి అభిమానులు కాలర్ ఎగారేసుకునేలా చేస్తాను” అని ఏ టైం చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్, తన అభిమానులని ఎత్తిన కాలర్ దించనివ్వట్లేదు. ఈసారి కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఫాన్స్ అందరినీ కాలర్ ఎగారేసుకునేలా చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ‘కొమురం భీమ్’ పాత్రలో ఎన్టీఆర్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినీ పండితులు సైతం ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు, త్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీకి జై కొట్టారు. రోడ్ టు ఆస్కార్ లో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన మొదటి ఆర్టికల్ రాసింది ‘వెరైటీ’ మ్యాగజైన్. ఎన్టీఆర్ బెస్ట్ హీరోగా ఆస్కార్ బరిలో నిలిచే ఛాన్స్ ఉందంటూ ప్రిడిక్ట్ చేసిన ‘వెరైటీ’ మ్యాగజైన్ ఒక సెన్సేషన్ కి క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా, కీరవాణి, రాజమౌళి, రామ్ చరణ్ లు కూడా ఆస్కార్ రేస్ లో ఉండే ఛాన్స్ ఉందంటూ ఇతర లీడింగ్ మ్యాగజైన్స్ కూడా ఆర్టికల్స్ ని పబ్లిష్ చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని గెలుచుకుంది.
తాజాగా ఏ ఇండియన్ యాక్టర్ కి ఇప్పటివరకూ సాధ్యం కాని రేర్ ఫీట్ ని ఎన్టీఆర్ సాదించాడు. ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉండే ఛాన్స్ ఉందని ప్రిడిక్ట్ చేసిన ‘వెరైటీ’ మ్యాగజైన్, తాజాగా ప్రచురించిన ఆర్టికల్ లో ‘ఆస్కార్ టాప్ యాక్టర్స్ ప్రిడిక్షన్ లిస్టు టాప్ 10’లో ఎన్టీఆర్ కూడా చోటు సంపాదించాడు. ఒక భారతీయ నటుడు టాప్ 10 ప్రిడిక్షన్ లిస్ట్ లో ఉండడం ఇదే మొదటిసారి. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు, ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానులు కూడా ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. #ManofMassesNTR అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నిజంగానే ఆస్కార్ ఫైనల్ ప్రాబబుల్స్ లో ఉన్నా చాలు అది మనకి ఆస్కార్ గెలిచినంత గొప్ప విషయమే, ఇక ఎన్టీఆర్ ఆస్కార్ గెలిస్తే… వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ యాక్టర్స్ లో ఒకడిగా ఎన్టీఆర్ పేరు చరిత్రకెక్కుతుంది.