సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర గ్లిమ్ప్స్ జనవరి 8న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న దేవర సినిమా రేంజ్ ఏంటో అంటే గ్లింప్స్ ముందెన్నడూ చూడని డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పటివరకు ఉన్న డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తే దేవర హైప్ ఆకాశాన్ని తాకుతుంది.
ఇది జరగాలి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందున్న టార్గెట్స్ ఏంటో చూద్దాం… పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ 940K వ్యూస్, OG గ్లిమ్ప్స్ 730K సింగల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సినిమాల గ్లిమ్ప్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. సింగిల్ ఛానెల్ మల్టిపుల్ ఆడియో విషయంలో సలార్ 1.67 మిలియన్ లైక్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లిమ్ప్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయాలి అంటే భీమ్లా నాయక్ రికార్డ్ ని బ్రేక్ చేసి సింగల్ లాంగ్వేజ్ లో 1 మిలియన్ లైక్స్ ని రీచ్ అవ్వాలి. సింగల్ ఛానెల్ మల్టీ ఆడియోలో 1.7 మిలియన్ లైక్స్ ని రాబట్టి సలార్ గ్లిమ్ప్స్ ని దాటాలి, అప్పుడే దేవర టాప్ ప్లేస్ లో ఉంటుంది. మరి ఈ రికార్డ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందుకుంటారో లేదో చూడాలి.