రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా చిత్రాలతో పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ సీటాడెల్, బేబీ జాన్‌తో యాక్షన్ హీరోగా మారాడు. సీటాడెల్ ఓటీటీకే పరిమితం కాగా తేరీ రీమేక్ బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. మనకు ఈ సీరియస్ కథలు పడటం లేదని త్వరగానే గ్రహించిన వరుణ్ మళ్లీ జోవియల్ రోల్స్‌కు షిఫ్టై పోతున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడితో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమయ్యాడు. నెక్ట్స్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే ఫక్త్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌తో రాబోతున్నాడు.
Also Read : NBK : బాలయ్యని చుస్తే.. ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్
సన్నీ సంస్కారి కీ తులసి కుమారిలో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మరోసారి జోడీ కడుతున్నారు. గతంలో బవాల్ అనే ఓటీటీ ఫిల్మ్‌లో నటించగా మిక్స్ డ్ రివ్యూ తెచ్చుకుంది. దీంతో తమ ఇద్దరికీ మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడు శశాంక్ ఖైతాన్‌నే నమ్ముకున్నారు. జానుకు డెబ్యూ మూవీ దడక్‌తో హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్ ఇచ్చిన డైరెక్టర్ ఇతడే. అలాగే వరుణ్ హంప్టీ శర్మ కి దుల్హానియా, బద్రినాథ్ కి దుల్హానియా వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు శశాంక్. సన్నీ సంస్కారీ తులసి కుమారి వరుణ్ అండ్ శశాంక్ థర్డ్ ఫిల్మ్. ఇప్పటికే ఏప్రిల్ 18 నుండి సెప్టెంబర్ 12కి వాయిదా వేసిన ఈ ఫిల్మ్ మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకుంది. అక్టోబర్ 2 అంటే దసరా బరిలో సినిమా రాబోతున్నట్లు గతంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వగా ఇప్పుడు టీజర్‌తో మరోసారి కన్ఫర్మ్ చేశారు. వరుణ్- జాన్వీ కపూర్‌తో పాటు సాన్య మల్హోత్రా, రోహిత్ సరాఫ్ నటిస్తున్నాడు టీజర్ ఫస్ట్‌లో బాహుబలి గెటప్‌లో కనిపించి సౌత్ అటెన్షన్ తీసుకున్న వరుణ్ ధావన్ మూడేళ్ల తర్వాతైనా హిట్ కొడతాడో లేదో.