నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి థమన్, బాబీ, బోయపాటి, గోపీచంద్ మలినేనితో పటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Also Read : NBK : వాళ్లు లేకుంటే నేను లేను.. ఈ రికార్డులు.. అవార్డులకు వాళ్లే కారణం : నందమూరి బాలకృష్ణ
ఈ ఈవెంట్ లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ .. ‘బాలయ్య తో పని చేస్తుండేటప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్తుంటాను. ఇలా వరల్డ్ బుక్ రికార్డులే కాదు రేపు వచ్చే మా ‘అఖండ 2’ అన్ని రికార్డుల్ని చెరిపేస్తుంటుంది. ‘అఖండ’కి ముందు ‘అఖండ’కి తరువాత అన్నట్టుగా నా మ్యూజిక్ మారిపోయింది. నా మ్యూజిక్‌కు బాలయ్య పునర్జన్మను ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయనకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. బాలయ్య బాబు గారి యాభై ఏళ్ల సినీ జర్నీలో నేను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో పని చేస్తుంటే గుడికి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. బాలయ్యని చూస్తే మాట్లాడలేము.. ఎదో తీసి కొట్టాలనిపిస్తుంది. నా చేతికి ఏవో రెండు మొలుస్తాయ్. మా వాళ్ళు అడుగుతారు ఏంటి బాలయ్యని చూస్తే మీకు వచ్చే ఎనర్జీ ఏంటి అని.. నాకు బాలయ్య సినిమాకు పనిచేసేటప్పుడు ఆ ఆరా వేరే లెవల్ లో ఉంటుంది’ అని అన్నారు.