కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలు, షోలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ టైం నడుస్తోంది. అంతేకాక సందర్భంతో పని లేకుండా జై బాలయ్య అనే పదం వాడుకలోకి బాగా వచ్చేసింది. నిజానికి హైదరాబాద్ లోనే కాదు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో పబ్స్ లో బాలకృష్ణ పాటలు ప్లే చేయిస్తూ జై బాలయ్య నినాదాలు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే ఇతర హీరోల సినిమాలకు వెళ్లి జై బాలయ్య నినాదాలు చేయడం కూడా కామన్ గా చూస్తూనే ఉన్నాం. యితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది అదేమిటంటే తమిళ్ లో ఒక సినిమాలో కమెడియన్ యోగి బాబు చేత జై బాలయ్య అనిపించారు మేకర్స్.
Om Bheem Bush Trailer: ఓం భీమ్ బుష్ ట్రైలర్ రిలీజ్.. ఏం కామెడీ ఉంది మావా.. నవ్వి నవ్వి చచ్చిపోతారు
థూకుదురై అనే సినిమాలో యోగి బాబు కీలక పాత్రలో నటించారు. హారర్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి నెలలో రిలీజ్ అయ్యి ఓ మాదిరి టాక్ అందుకుంది. ఈ సినిమాలో యోగి బాబు పాత్ర ఒకసారి మాయమై పోవడానికి జై బాలయ్య అనే నినాదం పలుకుతాడు, ఆ వెంటనే మాయం అయిపోతాడు. నిజానికి ఈ సినిమా రిలీజ్ అయింది జనవరి నెలలోనే అయినా ఓటీటీలోకి ఈ మధ్యనే వచ్చింది. దీంతో ఈ విషయం తెలుగు ప్రేక్షకులు దృష్టి కూడా వచ్చింది. అక్కడ కూడా మా బాలయ్య డామినేషనే అని బాలకృష్ణ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది తమిళ్ సినీ పరిశ్రమ బాలకృష్ణను ట్రోల్ చేసింది. ఆ విషయం కూడా అర్థం కాకుండా మన డామినేషనే అంటూ ఎందుకలా చంకల గుద్దుకుంటున్నారు? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.
ఏ భాష ఐనా బాలయ్య డామినేషన్ 🥵🥵😏😏
జై బాలయ్య 🥵 pic.twitter.com/OfvfIu6KHP
— భం అఖండ (భగవంత్ కేసరి) 💥💥 (@legendSashidhar) March 14, 2024