టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలయ్య, చిరు, వెంకీ, నాగ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూ దూసుకెళ్తున్నారు. వీరిలో ముందుగా నందమూరి బాలకృష్ణ : డాకూ మహారాజ్ హిట్టుతో ఇయర్ స్టార్ట్ చేసిన అఖండ2తో ఇయర్ ఎండింగ్ టార్గెట్ చేస్తున్నారు. డిసెంబర్ బరిలో రాబోతోంది అఖండ సీక్వెల్. అయితే ఈ మధ్యలోనే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారు. వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో…
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నందమూరి బాలయ్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ కొట్టాడు బాలయ్య. అదే ఊపులో తనతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను తో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య. వీరి కాంబోలో ఇప్పటి వరకు సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 ను గ్రాండ్…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగవ సీజన్ అక్టోబర్ 25 అంటే రేపటి నుండి స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. Love Reddy: షాకింగ్: లవ్…
Nandamuri Balakrishna @ 50 Years Special : నందమూరి బాలకృష్ణ, ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాతమ్మకల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు నందమూరి బాలకృష్ణ. చేసిన మొదటి సినిమాతోనే తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్న ఆయన త్వరగానే హీరోగా కూడా మారిపోయాడు. ఇక ఆయన నటుడిగా మారి ఈరోజుకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50 సంవత్సరాలు నటుడిగా ప్రస్థానం సాగించి ఇప్పటికీ…
నందమూరి రెండవ తరం నటుడిగా 1974లో వచ్చిన తాతమ్మ కల చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు నందమూరి బాలకృష్ణ. తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికి పుచుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా అంచలంచలుగా ఎదుగుతూ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని నందమూరి లెగసిని కొనసాగిస్తున్నారు బాలయ్య. ఈ సినీప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటుకుని, మరెన్నో శిఖరాలు చేరుకొని నాటి నుండి నేటి వరకు అగ్ర కథానాయకుడిగా సాగుతున్నారు. కాగా నందమూరి…
Nandamuri Mokshagna : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నట్లు కన్ఫామ్ అయ్యింది. అతను ఎవరో కాదండోయ్.. నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ. ఇతను ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడని ప్రచారం జరుగుతున్న ఎలాంటి వార్తలు మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడింది. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం…
కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలు, షోలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ టైం నడుస్తోంది. అంతేకాక సందర్భంతో పని లేకుండా జై బాలయ్య అనే పదం వాడుకలోకి బాగా వచ్చేసింది. నిజానికి హైదరాబాద్ లోనే కాదు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో పబ్స్ లో బాలకృష్ణ పాటలు ప్లే చేయిస్తూ జై బాలయ్య నినాదాలు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే ఇతర హీరోల సినిమాలకు వెళ్లి జై…
Ram Gopal Varma says Jai Balayya: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రీసెంట్ గా 20 ఏళ్ళ తరువాత అమెరికా నాటా వేడుకకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లిన రాంగోపాల్ వర్మ ట్రిప్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు అయితే కలకలం రేపుతున్నాయి. ముందుగా “నాటా నిర్వాహకులు నా అమెరికా ట్రిప్ను ఎంతో బాగా హ్యాపీ గా సాగేలా చేశారు, అమెరికా నాకెంతో ఇష్టం. అలాగే అమెరికాకు…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్య ఇప్పుడు సూపర్బ్ క్రేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. బ్యాక్ టు మిలియన్ డాలర్ సినిమాలు, వందల కోట్ల వసూల్ చేసిన సినిమాలు బాలయ్య నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా అన్-స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ మరింత మరింత పెరిగింది. జై బాలయ్య అనే స్లోగన్ ఒకప్పుడు నందమూరి అభిమానులకి మాత్రమే పరిమితం అయ్యేది, ఇప్పుడు జై బాలయ్య అనేది సెలబ్రేషన్ స్లోగన్ లా మారిపోయింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ ప్రతి…
VeeraSimha Reddy : నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'లోని ఫస్ట్ సింగిల్ ముహూర్త సమయానికి నవంబర్ 25 ఉదయం 10 గంటల 29 నిమిషాలకు అభిమానులను పలకరించింది.