KGF 2 : కెజిఎఫ్ 2 ఎఫెక్ట్.. వెడ్డింగ్ కార్డుపై వయలెన్స్ డైలాగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాకా ఆ అవాడకం ఇంకా పెరిగిందనే చెప్పాలి. సంజయ్ దత్ తో ఫైట్ తరువాత యష్..” వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్ వయలెన్స్ లైక్స్ మి.. ఐ కాంట్ అవైడ్ ఇట్” అని పవర్ ఫుల్ గా చెప్తాడు. ఈ డైలాగ్ కు థియేటర్లో ఈలలు మాములుగా పడలేదు. బయట కూడా ఏదైనా నచ్చక చేసే పని ఉంటే అందరు ఈ డైలాగ్ ను ఉపయోగించేస్తున్నారు.. ఇక ఈ డైలాగ్ తో ఎన్ని మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక తాజాగా ఒక యువకుడు ఏకంగా తన పెళ్లి కార్డులో కూడా ఈ డైలాగ్ వాడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు తన పెళ్లి కార్డులో చివరన .. “మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్.. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవైడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవైడ్.” అంటూ రాసుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా పెద్దల బలవంతంతో పెళ్ళికి ఒప్పుకోవాల్సివచ్చింది అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఓరి నీ దుంప తెగ ఇదెక్కడి వెడ్డింగ్ కార్డురా అని కొందరు.. నువ్వు దైర్యంగా చెప్పావ్ .. మేము చెప్పలేదు బ్రో అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా ఆగడు లో మహేష్ బాబు చెప్పినట్లు.. సినిమాల ప్రభావం జనాలపై ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది అని ఈ వెడ్డింగ్ కార్డు చూస్తుంటే తెలిసిపోతుంది.
Also Read
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..