Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Durgha Tej React on Movie With Pawan Kalyan: మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్.కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సంబరాల ఏటి గట్టు’. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న సంబరాల ఏటి గట్టు సినిమా విడుదల కానుంది. నేడు సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పుట్టిన రోజు. తన పుట్టినరోజు సందర్భంగా FNCCలో అభిమానులతో హీరో సాయి ముచ్చటించాడు.
సంబరాల ఏటి గట్టు తరువాత మంచి రూరల్ బ్యాక్‌డ్రాప్ (గ్రామీణ నేపథ్యం)లో సినిమా చేస్తాను అని అభిమానులతో సాయి దుర్గా తేజ్ చెప్పాడు. ఆరు ఫ్లాప్స్ తర్వాత హిట్ రాకపోతే వేరే హీరో ఫ్యాన్స్ మాత్రమే కాదు తన ఫ్యాన్స్ కూడా ఊరుకోరని.. అందుకే మంచి రూరల్ బ్యాక్‌డ్రాప్ చేస్తానన్నాడు. ‘బ్రో’ తర్వాత నా సినిమా వచ్చి చాలా లేట్ అయ్యిందని, సంబరాల ఏటి గట్టుతో సంక్రాంతికి వస్తున్నా డోంట్ వర్రీ అంటూ అభిమానులతో సాయి దుర్గా తేజ్ సరదాగా అన్నాడు.
Also Read
మామ పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు? అని ఓ అభిమాని అడగ్గా.. సాయి దుర్గా తేజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘నేను కళ్యాణ్ మామతో సినిమా ఎప్పుడూ చేస్తాను అని అడుగుతున్నావా బ్రో. నేను బ్రో అనే సినిమా ఆల్రెడీ చేశా. బ్రో మీరు చూడకపోతే వెళ్లి ఓటీటీలో చూడండి. అయినా తప్పు మాదే. బ్రో సినిమాకు మును సరిగ్గా ప్రమోట్ చెయ్యలేదు అప్పుడు’ అని సాయి చెప్పుకొచ్చాడు. సాయి తేజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజావార్తలు
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!