Will Smith అకాడమీ అవార్డుల వేడుకలో తాను చేసిన పనికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. మార్చి 27న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఆస్కార్ 2022లో లైవ్ వేడుకలో క్రిస్ రాక్‌ని కొట్టి విల్ స్మిత్ అందరినీ షాక్‌కి గురి చేశాడు. క్రిస్ ఒక అవార్డును అందించడానికి వేదికపైకి వచ్చి, విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గురించి చమత్కరించారు. ఆమె GI జేన్ 2 లాగా ఉందని జోక్ చేశాడు. తన భర్యపై క్రిస్ వేసిన పంచ్ విల్‌కు కోపం తెప్పించింది. దీంతో వెంటనే స్టేజ్ పైకి వెళ్లి క్రిస్ చెంప చెళ్లుమన్పించాడు విల్ స్మిత్. ఇక ఇదే వేదికపై ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విల్ స్మిత్, ఇప్పుడు క్రిస్ రాక్‌ను వేదికపై పంచ్ చేసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
Read Also : Amitabh Bachchan : ఏజ్ ఎంతైనా తగ్గేదే లే… డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ !!
విల్ స్మిత్ సోషల్ మీడియాలో హాస్యనటుడు క్రిస్ రాక్ చర్యల వల్ల తాను ఇబ్బంది పడ్డానని, జాడా వైద్య పరిస్థితిపై అతను వేసిన జోక్ భరించలేనిదిగా ఉందని చెప్పాడు. క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నోట్ లో “అన్ని రూపాల్లో హింస అనేది విషపూరితమైనది, విధ్వంసకరం. గత రాత్రి అకాడమీ అవార్డులలో నా ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు, క్షమించరానిది. జోకులు నా ఉద్యోగంలో భాగం… కానీ జాడా ఆరోగ్య పరిస్థితి గురించి ఒక జోక్ నేను భరించలేనిదిగా అన్పించింది. అందుకే నేను ఎమోషనల్ గా అలా స్పందించాను. క్రిస్, నేను మీకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను తప్పు చేసినందుకు సిగ్గుపడుతున్నాను. నా చర్యలు నేను ఉండాలనుకుంటున్న వ్యక్తిని సూచించలేదు. ప్రేమ, దయ ఉన్న ప్రపంచంలో హింసకు చోటు లేదు… నేను అకాడమీకి, షో నిర్మాతలకు, హాజరైన వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను విలియమ్స్ కుటుంబానికి, నా కింగ్ రిచర్డ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను” అంటూ విల్ స్మిత్ తన నోట్‌ని ముగించాడు.