Allu Sirish: గౌరవం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన శిరీష్ టాలీవుడ్ లో స్టార్ గా మారడానికి చాలానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ల తో కలిసి సినిమాలు చేస్తున్నా స్టార్ గా మాత్రం శిరీష్ ఎదిగింది లేదు. ఇక నిజం చెప్పాలంటే.. శిరీష్ ఎంచుకున్న కథలు అన్ని ఇంచుమించుగా కుటుంబ కథా చిత్రాలే.. విభిన్నమైన కథలను ఎంచుకున్నా శిరీష్ కు ఒరిగిందేం లేదు.. ఇప్పటివరకు శిరీష్ అరడజన్ సినిమాలు చేశాడు. అయినా భారీ హిట్ అని చెప్పుకోవడానికి ఒక్క సినిమా లేదు.. ఇక ఇవన్నీ కాదు ఎలాగైనా ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి.. స్టార్ గా ఎదగాలి అనేదే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ హీరో.. స్టార్ హీరోకు తమ్ముడిగా, స్టార్ ప్రొడ్యూసర్ కు వారసుడిగా ఇండస్ట్రీకి ఈజీగానే వచ్చినా హీరోగా నిలబడడం కోసం తపన పడుతున్న నెపో కిడ్ అల్లు శిరీష్. ఇ హిట్ కోసం ఈసారి అల్లువారబ్బాయి రొమాన్స్ ను ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఉర్వశివో రాక్షసివో సినిమాపైనే అల్లు అబ్బాయి ఆశలన్నీ పెట్టుకున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి హీరోయిన్ తో రొమాంటిక్ పోజులు ఇచ్చి కొద్దిగా హైప్ క్రియేట్ చేసిన శిరీష్ టీజర్ తో ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు. మునుపెప్పుడు చేయని ఘాటు రొమాన్స్ ను అల్లువారబ్బాయి ఈ సినిమాలో చేసినట్లు టీజర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ఘాటు పెదవి చుంబనాలు.. బెడ్ సీన్స్ తో హీట్ పెంచేశాడు. అయితే ఈ టీజర్ చూసినవారు మాత్రం అల్లువారబ్బాయి కొద్దిగా హద్దుమీరినట్లే కనిపిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో శిరీష్ లిప్ లాక్ లు, బెడ్ సీన్లు కొంచెం ఘాటుగానే చూపించారు. దీంతో హిట్ కోసం అల్లువారబ్బాయి కొద్దిగా ట్రాక్ మార్చాడని అంటున్నారు. టీజర్ ఇంట్రెస్టింగ్ ఉండడంతో ప్రేక్షకులు సైతం సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎంత ఘాటు సీనులు ఉన్నా కథలో బలం లేకపోతే ఏ హీరో సినిమాను అయినా ప్రేక్షకులు ఆదరించడంలేదన్నది నమ్మదగ్గ నిజం. టీజర్ మొత్తాన్ని ముద్దులు, హగ్ లతో నింపేసి హైప్ ఇచ్చిన డైరెక్టర్ సినిమాలో కథను చూపించకపోతే మాత్రం శిరీష్ ఈ సినిమా చేసినా హిట్ అందుకోదనేది వాస్తవం. మరి ఈసారైనా ఈ అల్లువారబ్బాయి తను నమ్ముకున్న జోనర్ లో హిట్ అందుకుంటాడా..? లేదా..? అనేది తెలియాలంటే.. నవంబర్ 4 వరకు ఆగాల్సిందే.