ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా లెవల్లో తమ సినిమాలు నిలవాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కథ, దర్శకుడు, నిర్మాణం లాంటివి హై రేంజ్ లో ఉండాలని చూస్తున్నారు. కుర్ర హీరోలతో సహా అందరు పాన్ ఇండియా మూవీలను మొదలుపెట్టేశారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబును కూడా పాన్ ఇండియా లెవల్ హీరోగా చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఇప్పటికే హిందీ లో సినిమాలు చేయడం వేస్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన మహేష్.. మొహమాటం లేకుండా హిందీలో అడుగుపెట్టడు.. ఇక చేస్తే పాన్ ఇండియా మూవీ చేయాలి.. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సినిమాతోనే అది సాధ్యపడుతుంది అన్న విషయం తెల్సిందే.. అయితే ప్రస్తుతం ఆయన నిర్మించిన మేజర్ సినిమా ప్ భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే.. ఇక ఈ సినిమాలో అడివి శేష్ బదులు మహేష్ ఉండి ఉంటే ఎంత బావుండేది అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మేజర్ గా మహేష్ నటించి ఉంటే ఈ ఏడాది ది బెస్ట్ మూవీ ఇదే అయ్యేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటున్నారు.
మేజర్ గా మహేష్ ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరూ లో కనిపించాడు మహేష్.. ఈ సినిమాలో కూడా మహేష్ నటించి ఉంటే పాన్ ఇండియా మూవీ వరల్డ్ లోకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పినట్లు ఉండేది.. రాజమౌళి సినిమాపై మరింత అంచనాలు పెరిగేవి అని అంటున్నారు. అయితే వారు అనుకున్న దానిలో కూడా తప్పు లేదంటున్న సినీ వర్గాలు.. ఒక గొప్ప యోధుడు కథ.. పాన్ ఇండియా రీచ్ ఉండే సినిమా మహేశ్ కనుక చేసి ఉంటే ‘మేజర్’ ఒక గొప్ప మూవీ అయ్యేది. పాన్ ఇండియా ఆడియన్స్‌కి కూడా మహేశ్, సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమాతో పరిచయం అయినట్లు ఉండేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరోపక్క మహేష్ చేస్తే బావుండేది కానీ కొన్ని కొన్ని సినిమాలకు కొంతమంది మాత్రమే సెట్ అవుతారు.. ఆ విషయం మహేష్ గమనించాడు కాబట్టే శేష్ వద్దకు వెళ్లి మరీ సినిమా చేద్దామని అడిగాడు, నిర్మాతగా మారి నిర్మించాడు అని కొంతమంది అంటున్నారు. ఇందులో నిజం ఏదైనా మేజర్ సందీప్ గా శేష్ నటించాడు అనడం కన్నా జీవించాడు అనే చెప్పాలి..