ప్రపంచంలో ఎక్కడైనా ఒకే రంగానికి చెందినవారి మధ్య పోటీ ఉండడం సహజమే.. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఎంత పోటీ ఉంటుందో .. దర్శకులు, నిర్మాతలు .. అంతెందుకు డిస్ట్రిబ్యూటర్ల మధ్య కూడా అంతే పోటీ ఉంటుంది. ఇక తాజాగా ఒక డిస్ట్రిబ్యూటర్ పేరు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ‘ఆచార్య’ సినిమా నైజాం హక్కులను సొంతం చేసుకోవడమే.. ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు వరంగల్ శ్రీను. మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ హిట్ తో నైజాం లో హాట్ టాపిక్ గా మారిన వరంగల్ శ్రీను ప్రస్తుతం ‘ఆచార్య’తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అల్లరి నరేష్ ‘నాంది’, నితిన్ ‘చెక్’, విశాల్ ‘చక్ర’, కార్తీ ‘సుల్తాన్’ వంటి చిత్రాల నైజాం హక్కులను సొంతం చేసుకొని స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా మారాడు.
ఇక ‘ఆచార్య’ నైజాం హక్కులను వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో స్టార్ డిస్ట్రిబ్యూటర్ తో పోటీపడి మరీ భారీ ధరకు ఈ హక్కులను సొంతం చేసుకున్నాడట వరంగల్ శ్రీను. అందుతున్న సమాచారం ప్రకారం రూ. 42 కోట్లు చెల్లించి ఆ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఆ కారణంగానే ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 133 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. మరి ఏప్రిల్ 29 న నైజాం లో రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.