Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రానటువంటి సోషియో ఫాంటసీ లోకం ఇందులో సృష్టిస్తున్నాడు వశిష్ట. ఈ మూవీ గురించి రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గన్న వశిష్ట చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఇది సోషియో ఫాంటసీ మూవీ కాబట్టి జగదేక వీరుడు-అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అంటూ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. దానిపై తాజాగా వశిష్ట స్పందించాడు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఇలాంటి ప్రచారాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ టైమ్ వచ్చినప్పుడే స్పందిస్తే బాగుంటుందని ఊరుకున్నాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఇది సీక్వెల్ కాదు.
Read Also : Vishwambhara : రామ్ చరణ్ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..
ఒకవేళ సీక్వెల్ అయితే మేం ఇప్పటికే ఆ విషయాన్ని చెప్పేవాళ్లం. విశ్వంభర ఏ సినిమాకు సీక్వెల్ గా రావట్లేదు. జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీకి సీక్వెల్ అయితే ఈ పాటికే అశ్వినీ దత్ దగ్గర రైట్స్ తీసుకునే వాళ్లం. కానీ మేం అలా తీసుకోలేదు. అలాంటప్పుడు సీక్వెల్ ఎలా అంటారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ తర్వాత అలాంటి సోషియో ఫాంటసీలో చిరంజీవి నటించలేదు. అందుకే ఈ మూవీ అలాంటిదేమో అని అంతా అనుకుంటున్నారు. మేం అనుకున్న కథను బేస్ చేసుకుని మూవీని ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు రానటువంటి కొత్త తరహా కథను మీరు చూస్తారు. ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్ మెయిన్. అందుకే వీఎఫ్ ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సోషియో ఫాంటసీ అనగానే ఏదో ఊహించేసుకుంటున్నారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక అసలు విషయాలు మీకే అర్థం అవుతాయి అంటూ చెప్పుకొచ్చాడు వశిష్ట.
Read Also : Peddi : రామ్ చరణ్ ’పెద్ది’ షూటింగ్ కి బ్రేక్..?