Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభరపై మంచి అంచనాలు ఉన్నాయి. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ కారణంగా ఆలస్యం అవుతోందనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. సోషియో ఫాంటసీగా వస్తున్న విశ్వంభర మూవీ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దానిపై తాజాగా డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. అందరూ రామ్ చరణ్ వల్లే ఓకే అయిందని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. బింబిసార మూవీ తర్వాత నేను ఓ లైన్ అనుకున్నాను. ఓ సారి యువీ క్రియేషన్స్ విక్కీ అన్నను కలిశా. చిరంజీవిని కలిసి నా లైన్ చెప్పాలని ఉందని విక్కీకి చెప్పా.
Read Also : Peddi : రామ్ చరణ్ ’పెద్ది’ షూటింగ్ కి బ్రేక్..?
అతను తీసుకెళ్లి పరిచయం చేశాడు. నేను చెప్పిన లైన్ చిరంజీవికి నచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు మూవీ కన్ఫర్మ్ చేశారు. మరోసారి ఆయన వద్దకు వెళ్లి స్టోరీ నరేట్ చేసి చెప్పాను. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క సినిమా చేసిన నాకు ఏకంగా చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. మూవీ వీఎఫ్ ఎక్స్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కొత్త రకమైన కథ కాబట్టి అంత త్వరగా ఇది ఎక్కదు. చిరంజీవి నాపై నమ్మకం ఉంచి ఒప్పుకున్నారు. ఆయనకు నచ్చే విధంగా మూవీ షూట్ చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు వశిష్ట.
Read Also : Kingdom : నా గర్ల్ ఫ్రెండ్ తో గడపాలని ఉంది.. విజయ్ ఓపెన్ అయ్యాడుగా..