టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తో హిట్ ను అందుకున్న విషయం విదితమే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విశ్వక్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వివాదంలో చిక్కికోవడం, తరువాత వాటికి క్లారిటీ ఇవ్వడం.. ఇలా ఈ వివాదాల వలనే సినిమాకు బోల్డంత పబ్లిసిటీ ఏర్పడింది. ఇక సినిమా కథ కూడా కొంచెం ప్రేక్షకులను మెప్పించేలా ఉండడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకెళ్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఓటిటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. మరో నాలుగు వారాల్లో ఈ సినిమా ఆహా లో ప్రసారం కానున్నట్లు వీడియోలతో సహా నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో కొంతమంది ప్రేక్షకులు ఇంకెందుకు థియేటర్ కు వెళ్లడం ఓటిటీలో చూడొచ్చు అని వెనుకడుగు వేస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ పై విశ్వక్ స్పందించాడు.
దయచేసి అలాంటి రూమర్స్ ను స్ప్రెడ్ చేయవద్దని నెటిజన్లను కోరాడు. “కొన్నిరోజుల నుంచి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ఓటిటీలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. నిజం చెప్పాలంటే నాకు కూడా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. అస్సలు ఇప్పటివరకు ఈ సినిమా ఓటిటీ హక్కులు వారివద్దకు వెళ్ళలేదు. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించగానే ఆదివారికంగా మేమే వెల్లడిస్తాం. ఇలాంటి రూమర్స్ వల్ల కొందరు ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లకుండా వాయిదా వేసుకుంటారు. కాబట్టి మీరు పెట్టిన పోస్టులు, వీడియోలు అన్ని డిలీట్ చేయండి” అంటూ విశ్వక్ కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.