Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ గురించి హింట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. సూర్యతో తాను చేయబోయే సినిమా గత సినిమాల కంటే డిఫరెంట్ గా ఉంటుందన్నారు.
Read Also : Allu Arjun : బ్లాక్ బస్టర్ డైరెక్టర్లను వదులుకున్న బన్నీ..!
సూర్య ఇందులో కామన్ మ్యాన్ గా కనిపించరు. సంజయ్ రామస్వామి లాంటి పాత్రలో ఆయన కనిపిస్తారని చెప్పారు వెంకీ. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉంటుందన్నారు. ఇలాంటి సినిమాలో సూర్య ఇప్పటి వరకు నటించలేదన్నారు. ఆయనతో చేయబోయే మూవీని అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నట్టు వివరించారు వెంకీ అట్లూరి.
సూర్య రెట్రో మూవీతో తెలుగునాట ప్లాప్ అందుకున్నా.. అటు తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వెంకీ అట్లూరితో చేస్తున్న మూవీతో హిట్ కొడుతాడని ఆయన ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. వెంకీ అట్లూరి ఈ నడుమ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉంటున్నాడు. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు సూర్యతో ఎలాంటి హిట్ కొడుతాడో చూడాలి.
Read Also : Samantha : అలా చేసే దమ్ముందా.. చెత్త కామెంట్స్ చేయకండి