విక్రమ్ నటించిన సినిమా వీర ధీర సూరన్ – పార్ట్ 2. ఎస్. ఏ అరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ఫినిష చేసుకుని అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. నేడు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు బుకింగ్ కూడా ఓపెన్ చేసారు అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.
Also Read : Mohan Lal : L2E ‘ఎంపురాన్’ ట్విట్టర్ రివ్యూ
అయితే చివరి నిమిషంలో ఈ సినిమా మార్నింగ్ షోస్ ను రద్దు చేసారు. వీర ధీర సూరన్ రిలీజ్ కు సంబంధించి ఢిల్లీ హైకోర్ట్ లో కేసు నమోదయింది. ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థ, ఈ చిత్రానికి ఫైనాన్షియర్ గా వ్యవహరించింది. అయితే ఈ సినిమాకు సంబంధించి అన్ని హక్కులను తామే కలిగి ఉన్నామని, అలాగే థియేటర్ రిలీజ్ కు సంబంధించి నిర్మాతలు తమతో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని మాకు చెల్లించవలసిన రూ. 7 కోట్ల బకాయిలు చెల్లించాకే సినిమాను విడుదల చేయాలనీ కోర్ట్ లో కేసు వేయడంతో రిలీజ్ విషయంలో చిక్కులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా వీర దీర్ సూరన్ మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేసారు. ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్న వారికి రిఫండ్ చేస్తామని ప్రకటించారు. అందుకు గాను నిర్మాణ సంస్థకు 48 గంటల గడువు ఇచ్చింది ఢిల్లీ హై కోర్టు. అన్ని అడ్డంకులు తొలిగి సినిమా రిలీజ్ అవుతుందో లేదా వాయిదా పడుతుందో మరి కొన్ని గంటల్లో తెలుస్తుంది.