పృద్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా వచ్చిన చిత్రం L2E ఎంపురాన్. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మించింది. భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలయింది. వరుస ప్లాప్స్ లు ఇస్తున్న మోహన్ లాల్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున షోస్ తో రిలీజ్ అయిన ఎంపురాన్ ట్విట్టర్ రివ్యూ ఉందంటే..?
Also Read : RC16 : రామ్ చరణ్ ‘పెద్ది’.. ఫస్ట్ లుక్ అదిరింది
సినిమాటోగ్రఫీ మరియు నిర్మాణ నాణ్యత అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అయితే, స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా ఉంది. మొదటి అర్ద భాగంలో మోహన్ లాల్ కి స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఇచ్చారు . దాదాపు 50 నిమిషాల తర్వాత లాల్ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సహ పరిచింది. సినిమాలో కథ కంటే ఎక్కువ స్టైలిష్ టేకింగ్ మీదనే ఎక్కువ ద్రుష్టి పెట్టారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉంది మరియు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. రెండవ భాగంలో కొన్ని మాస్ యాక్షన్ బ్లాక్స్ సూపర్ గా ఉన్నాయి. లూసిఫర్ హిట్ అవడానికి కారణమైన డ్రామా మరియు కోర్ ఎమోషన్ ఇందులో ఎక్కువగా లేదు. అలాగే ఫస్ట్ కంటే వైలెన్స్ ఎక్కువగా ఉంది. కథ సాగే వేగానికి అనవసరపు స్లో మోష్న షాట్స్ తో సినిమా నిడివి షాట్స్ నింపేసారు. మూడు గంటల నిడివి ఇబ్బంది పెట్టింది. చాలా వరకు సీన్స్ ట్రిమ్ చేయచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. మోహన్ లాల్ ఎప్పటిలాగే తనదైన నటనతో అదరగొట్టాడు కానీ ఈ చిత్రంలో స్క్రీన్ ప్రెజన్స్ చాలా తక్కువ. ఏ విధమైన అంచనాలు లేకుండా వెళ్తే చూడదగ్గ సినిమా ఎంపురాన్.