రామ్ గోపాల్ వర్మ.. అంటే అందరికి తెలిసింది ఏంటంటే.. అతడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. తాగి ఏది పడితే అది వాగుతాడు.. వివాదాలను కొనితెచ్చుకుంటాడు.. ఇదే అందరికి తెలిసిన వర్మ.. అయితే అస్సలు వర్మ ఇది కాదని, రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటో చెప్పుకొచ్చింది అతడి సోదరి విజయలక్ష్మి. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ వర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ” వర్మకు పెళ్లి అంటే నచ్చదు.. పెళ్లి చేసుకోవడం వలన నాకు వచ్చిన సమస్యలు గానీ .. కష్టాలుగానీ ఏమీ లేవు. కానీ నా అభిప్రాయంగా చెప్పాలంటే మాత్రం పెళ్లి అనేది నాకు ఇష్టం ఉండదనే చెబుతాను అని చెప్పుకొస్తాడు. ఇక అందరు అనుకున్నట్లు వర్మకు అమ్మాయిల పిచ్చి లేదు. నాకు చిన్నతనంలోనే ఆ విషయం అర్ధమయ్యింది. చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చింది. వచ్చిన వెంటనే వర్మ నీ కళ్లు చాలా బావున్నాయి అని చెప్పేశాడు. అది విని నేను షాక్ అయ్యాను.
ఎందుకంటే ఆ రోజుల్లో అలా ఒక అబ్బాయి అనడం అరుదు. ఆ తరవాత చాలాసార్లు నా స్నేహితురాలు మీ అన్న నన్ను పొగిడాడు అని చెప్పుకునేది. అయితే ఈ విషయం నేను వర్మను అడిగా .. దానికి మెల్లకన్ను .. అది నీకు ఎలా నచ్చింది అని.. అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అలా అనేశాను అని చెప్పుకొచ్చాడు. మరోసారి బ్యాంకులో ఇంకో అమ్మాయి నవ్వు బావుందని చెప్పాడు.. అమ్మాయిలను సంతోషపెట్టే మాటలే తప్ప ఏరోజు వర్మ అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసింది లేదు .. వారు ఫిర్యాదు చేసింది లేదు. ఇక ఇటీవల అమ్మాయిలతో డాన్సులు వేయడం కూడా అలాంటిదే.. నేనేంటో తెలిసి మనింట్లో వాళ్లే అట్లా అనుకుంటే ఎట్లా? నేనేదో ఎఫెక్ట్ కోసం చేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు” అని తెలిపింది. దీంతో అస్సలు వర్మ బయటపడిపోయాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.