Eagle: సంక్రాంతి అంటే .. సినిమా పండుగ. తెలుగు ప్రేక్షకులకు అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసే పండుగ .. అందుకే ప్రతి హీరో .. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇక ప్రతి సంక్రాంతికి రెండు పెద్ద హీరోల సినిమాలు .. రెండు చిన్న సినిమాలు.. ఒకటో రెండో డబ్బింగ్ సినిమాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం దాదాపు మొత్తం పెద్ద హీరోల సినిమాలు ఉండడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సంక్రాంతిని మహేష్ బాబు గుంటూరు కారం తో కర్చీఫ్ వేసేశాడు. దీని తరువాత అటు ఇటు మరో మూడు సినిమాలు నా సామీ రంగా, హనుమాన్, ఫ్యామిలీ మ్యాన్ వచ్చి చేరాయి.. ఇప్పటికే ఇవి ఫైనల్ అయ్యాయి అనుకొనేలోపు ఇంకో సినిమా వచ్చి చేరింది. అదే ఈగల్. మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభంచిన ఈగల్ .. నేడు రిలీజ్ డేట్ ను రిలీజ్ చేసింది. జనవరి 13 న ఈగల్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు.
NTR: బావ నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే.. బామ్మర్ది ఏంటి ఇలా చెప్పుకొచ్చాడు
ఇక అదే రోజున మహేష్ గుంటూరు కారం రానుంది. మహేష్ వర్సెస్ రవితేజ.. పోటీకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాలు చిన్నవి అని చెప్పడానికి లేదు. పెద్ద ప్రొడక్షన్స్ హౌస్ లు .. స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్.. అన్నింటికీ మించి హీరోలకు సరిసమానమైన ఫ్యాన్స్ ఉన్నారు. సంక్రాంతికి టఫ్ కాంపిటేషన్ ఏదైనా ఉంది అంటే ఈ రెండు సినిమాలే అని చెప్పాలి. గుంటూరు కారం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబో కావడం, శ్రీలీల హీరోయిన్ కావడం.. మహేష్ మాస్ లుక్ ఇలా చాలా ఎలిమెంట్స్ గుంటూరు కారంలో ఉన్నాయి. ఇంకోపక్క రవితేజ మాస్ ఎనర్జీ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్, కార్తీక్ ఘట్టమనేని సూర్య వర్సెస్ సూర్య లాంటి ప్రయోగాత్మకైన సినిమా తీసి విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాని మీద తక్కువ అంచనాలు అయితే లేవు. ఇక ఈ ఏడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇది కనుక రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అందుకుంటే .. ఈగల్ పై మరిన్ని అంచులను పెరిగే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో సంక్రాంతి హీరో ఎవరో చూడాలి.
This time! Sankranthi is going to be full vibrant 🤗#EAGLE 🦅 13th Jan 2024! Theatres lo Kaludham :)))) pic.twitter.com/okV5LOSrgG
— Ravi Teja (@RaviTeja_offl) September 27, 2023