Pawan Kalyan : విజయ్ సేతుపతి తాజాగా నటించిన మూవీ ఏస్. మొదటి నుంచి మంచి ఇంట్రెస్ట్ పెంచుతున్న ఈ మూవీని మే 23న రిలీజ్ చేస్తున్నారు. ఆర్ముగ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ తో నింపేశారు. ప్రధానంగా విజయ్ సేతుపతితో యోగిబాబు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఇద్దరి కామెడీ మూవీకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కామెడీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే సినిమాలో ఓ భారీ ట్విస్ట్ కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చారు.
Read Also : Asaduddin Owaisi: హిందూ ఓట్ల ఏకీకరణ, విపక్షాల వైఫల్యమే బీజేపీ గెలుపుకు కారణం..
ఇందులో పవన్ కల్యాణ్ డైలాగ్ వాడేశాడు. మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగ్ ను ట్రైలర్ లో హైలెట్ చేశారు. ఈ డైలాగ్ అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో మనకు తెలిసిందే. పవన్ కల్యాణ్ డైలాగ్ ను విజయ్ తన మూవీలో వాడేయడం కూడా ఒకింత చర్చకు దారి తీసింది. పవన్ ఫ్యాన్స్ మద్దతు కోసమే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో మరో డైలాగ్ కూడా ఉంది. ‘విజయ్ దేవరకొండ ముఖంలాగే ఉంది’ అంటూ యోగిబాబు చివర్లో చెబుతాడు. మొత్తానికి ఈ రెండు డైలాగులతో తెలుగు ప్రేక్షకుల చూపును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. మే 23న సౌత్ లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కథలను ఎంచుకునే విజయ్.. ఈ సారి కూడా అలాంటి ప్రయత్నంతోనే వస్తున్నాడనే టాక్ నడుస్తోంది.
Read Also : Bhairavam : ‘భైరవం’ మూవీ ట్రైలర్ రిలీజ్..