Bhairavam : టాలీవుడ్ లో రాబోయే సినిమాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నది భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్నారు. వీరి నుంచి మూవీ వచ్చి చాలా రోజులు అవుతోంది. పైగా హిట్ కొన్ని ఏళ్లు గడుస్తోంది. పోస్టర్లు, టీజర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో ముగ్గురు హీరోల యాక్షన్ సీన్లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్లను కూడా కలిపి చూపించారు. అందుకే ఇది ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
Read Also : Suriya -Venky:సూర్యతో ప్రేమలు బ్యూటీ.. రేపే పూజ!
చూస్తుంటే మూవీ వర్కౌట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఇందులో యాక్షన్ కంటే అనుబంధాల ఎమోషన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. ముగ్గురు హీరోలలో ఎవరి పాత్రలను తక్కువ చేయకుండా మూవీని తెరకెక్కించారు. తమిళంలో హిట్ అయిన గరుడన్ మూవీకి రీమేక్ గా దీన్ని తీస్తున్నారు. ట్రైలర్ ను చూస్తుంటే తెలుగు వెర్షన్ లోకి మార్చేసి దీన్ని తీసినట్టు అర్థం అవుతోంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. నాంది సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్ కనకమేడల దీన్ని డైరెక్ట్ చేశాడు. విభిన్న సినిమాలు తీస్తున్న విజయ్.. ఈ మూవీని కూడా ఆ కోవలోనే తెరకెక్కించారనే ప్రచారం ఉంది.
Read Also : CID: ఫాల్కన్ స్కాం కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరు అరెస్ట్..