ప్రముఖ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి ఇటీవలే మీడియా ఇంటరాక్షన్‌లో తమిళ స్టార్ హీరో విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలిసిన అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయ్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం, మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఇదే కావడంవిశేషం. డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథను సూపర్‌స్టార్ మహేష్ బాబు తిరస్కరించగా, అదే కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Read Als o : మహేష్ “దూకుడు”కు పదేళ్లు
గతంలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో “మహర్షి” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత వారు మరొక ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు. అయితే వంశీ చెప్పిన కథ నచ్చకపోవడంతో మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించాడు. ఆ తరువాత వంశీ పైడిపల్లి మహేష్ బాబు కోసం తాను రాసిన కథను విజయ్‌కు వివరించాడు. విజయ్ పాత్రకు తగినట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసాడు. అయితే తాజా బజ్ ప్రకారం, ఈ సినిమా స్క్రిప్ట్ లో విజయ్ కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట. ఆయన సలహా మేరకు ఇప్పుడు వంశీ చేంజెస్ చేసే పనిలో పడ్డాడట. దిల్ రాజు నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ రూ .100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.