ప్రముఖ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి ఇటీవలే మీడియా ఇంటరాక్షన్‌లో తమిళ స్టార్ హీరో విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలిసిన అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయ్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం, మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం…