Naa Roja Nuvve hits massive 100 Million Views : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఖుషి అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోండగా ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకి సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది సినిమా యూనిట్. ఇక ఖుషి సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా ఈ సినిమా నుంచి ఇప్పటికే నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలు రిలీజ్ అయింది. ఇక యూట్యూబ్‌లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ చార్ట్ బస్టర్‌లుగా నిలిచిన ఈ సినిమాలోని మొదటి పాట అయిన నా రోజా నువ్వే వంద మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది.
Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?
ఈ క్రమంలో వంద మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన నా రోజా నువ్వే పాట ఇప్పుడు మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. నిజానికి గత పదకొండు వారాలుగా ఈ పాట సోషల్ మీడియాలో ఎక్కడో చోట ట్రెండ్ అవుతూనే వస్తోంది. ఇక ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను రేపు విడుదల చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. విజయ్ దేవరకొండ, సమంతలతో పాటుగా ఈ సినిమాలి జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తూనే కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.