Vivek Agnihotri: ప్రభాస్‌తో నాకు పోలికేంటి? ఎవడ్రా రాసింది ఇది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivek Agnihotri Responds on social media viral news: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కౌట్ అవలేదు. భారీ బడ్జెట్‌తో వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అయితే రాధేశ్యామ్ రిలీజైన రోజు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా విడుదలై దుమ్ము దులిపేసింది. ఇక వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్ సినిమా ఎందుకు ఫెయిల్ అయిందనే విషయం మీది కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజల నమ్మకాలకు సంబంధించిన కథలను ఎంచుకున్నప్పుడు మీక్కూడా దానిపై విశ్వాసం ఉండాలి లేదంటే ఆ సబ్జెక్ట్‌లో ఎంతోకొంత ప్రావీణ్యం ఉండాలని, దురదృష్టవశాత్తూ భారత్‌లో ఎవరూ దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చాడు.
Bhola Shankar Trailer: చిరు నట విశ్వరూపం..
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక ఆదిపురుష్ నటులను(ఆదిపురుష్‌లో ప్రభాస్ రోల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ..) కొందరు స్క్రీన్‌పై వచ్చి నేనే దేవుడిని అని చెప్తే నిజంగానే అతడు దేవుడయిపోతాడా? రోజూ రాత్రి ఇంటికి తాగి వచ్చి తెల్లారి నేను దేవుడిని, నన్ను నమ్మండి అని చెప్తే ఎవరూ నమ్మరని ఎందుకంటే జనాలేమీ పిచ్చోళ్లు కారని ఘాటుగా వ్యాఖ్యానించాడు. అయితే ఆయన ఆ కామెంట్లు చేసిన మరుసటి రోజే ప్రభాస్ రాధేశ్యామ్ ను కాశ్మీర్ ఫైల్స్ తో ఓడించా ఆయన మరో సినిమాను నా వాక్సిన్ వార్ సినిమాతో ఓడిస్తా అనే కామెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవ్వగా ఈ విషయం మీద వివేక్ అగ్నిహోత్రి స్పందించాడు. నేను అన్నట్టుగా నకిలీవార్తలు నాకు ఆపాదిస్తూ ఇలాంటి తప్పుడు విషయాలను ఎవరు ప్రచారం చేస్తున్నారు? మెగా మెగాస్టార్‌గా మెగా బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ అంటే నాకు చాలా గౌరవం, అయితే మేము నాన్ స్టార్టర్, స్మాల్ బడ్జెట్, పీపుల్స్ సినిమాలు తీస్తాము, అందువల్ల మా మధ్య ఎలాంటి పోలిక లేదు, దయచేసి నన్ను వదిలేయండి అని ఒక ట్వీట్ చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్ దెబ్బకు వివేక్ అగ్నిహోత్రి సారీ చెప్పాడు రా అని ప్రభాస్ ఫాన్స్ అంటుంటే ఆయన సారీ చెప్పినట్టు లేదని కావాలని ఎద్దేవా చేసినట్టు ఉందని నెటిజన్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..