Kushi Movie Censor Review: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మలయాళంలో హృదయం సినిమాతో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఖుషి’ సినిమాకి సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాక సినిమా చూసి సెన్సార్ సభ్యులు అభినందనలు తెలిపినట్టు చెబుతున్నారు. నిజానికి 165 నిమిషాల నిడివితో గల ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బృందం.
Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’
ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా బ్లాక్ బస్టర్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్ కు కనీసం 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే అని చెప్పక తప్పదు. కథలో ప్రేక్షకులు లీనమైతే కాస్త ఎక్కువ లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేయడంతో ఈ ‘ఖుషి’ విషయంలో టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయ్యి ఆడియెన్స్ లో కావాల్సినంత బజ్ ఏర్పడిందని చెప్పొచ్చు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన ‘ఖుషి’ సినిమాకి విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ బాగా ప్లస్ అని చెప్పొచ్చు. లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణ హిట్ ట్రాక్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ గ్రాండియర్ అన్నీ కలిపి ‘ఖుషి’ మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ తీసుకొచ్చాయని చెప్పక తప్పదు.