Vijay Devarkonda 13 Launched Officially: చేసింది తక్కువ సినిమాలే అయినా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ అయితే వచ్చేసింది. అతి తక్కువ కాలంలోనే రౌడీ హీరోగా యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్న ఆయన చివరిగా లైగర్ అనే సినిమా చేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్, ఛార్మి కౌర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న అంచనాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం దారుణంగా విఫలమయ్యాయి.
Also Read: Chiranjeevi: వచ్చే సంక్రాంతి బరిలో ఇంకా పట్టాలెక్కని చిరంజీవి సినిమా?
ఈ నేపద్యంలో విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని మూటగట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత చేయాల్సిన జనగణమన సినిమాని ఆపేశారు. తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా ప్రారంభించాడు. సమంత హీరోయిన్గా కాశ్మీర్ నేపద్యంలో ఒక అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు పరశురాంతో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ చేశారు.
Also Read: ‘Spy’ Movie: ‘స్పై’ చుట్టూ ఏం జరుగుతోంది.. క్లారిటీ లేకుండానే బుకింగ్స్ కూడా?
దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించగానే కలకలం చెలరేగింది. పరశురాం గతంలో కొన్ని నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకుని ఉండడంతో వారంతా అతనిపై ఫైర్ అయ్యారు. ఎట్టకేలకు అన్ని సమస్యలు క్లియర్ అయిన నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక అలా ఈ సినిమా అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తూ ఉండగా దిల్ రాజుతో పాటు వాసు వర్మ కూడా సినిమా నిర్మాణంలో భాగమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 54వ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇక పూజా మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మీద ఈ సినిమాకు శ్యాంప్రసాద్ రెడ్డి క్లాప్ ఇచ్చారు.