Confusion Continues aroing SPY Release Date: అర్జున్ సురవరం సినిమా తర్వాత కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరో అనిపించుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోట్ చేసుకుని రిలీజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన స్పై అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎడిటర్ నుంచి డైరెక్టర్ గా మారిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అందించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సదరు రాజశేఖరరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు కూడా.
Also Read: Tollywood top 10: టాలీవుడ్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 10 సినిమాలివే!
ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాని జూన్ 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఈ మధ్యకాలంలో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కాస్త సందిగ్ధత కొనసాగుతోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి కాబట్టి తక్కువ సమయం ఉన్న క్రమంలో వాయిదా వేయాలని కోరుతున్నట్టు వార్తలు వచ్చాయి. నిర్మాత ఏమో దాదాపు అందరికీ కమిట్మెంట్ ఇచ్చేశాను కాబట్టి వెనక్కి తగ్గే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరిగింది.
Also Read: Adipurush: తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్ల పెంపుకి పర్మిషన్.. ఎంత పెంచుకోవచ్చంటే?
అయితే నేపథ్యంలోనే నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాకి సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అలాగే రీ రికార్డింగ్ పూర్తి కాలేదు కాబట్టి రిలీజ్ చేయడం లేదని మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే ఇప్పుడు అమెరికా డిస్ట్రిబ్యూటర్ అయితే 28వ తేదీ అమెరికాలో ప్రీమియర్స్ జరుగుతున్నాయి అంటూ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసేశారు. ఇక సినిమా నిర్మాత రాజశేఖర్ రెడ్డి సైతం సినిమాని జూన్ 29వ తేదీనే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరోపక్క హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాత్రం ఆ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద సినిమా యూనిట్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తే గాని క్లియర్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.