Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైగర్ సినిమా ప్లాప్ తరువాత విజయ్ లో చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా.. డిఫరెంట్ లుక్ ట్రై చేయడం కొద్దిగా తగ్గించాడు. ఇక విజయ్ లేటెస్ట్ లుక్ ప్రేక్షకులను కలవరపెడుతుంది. ఎందుకంటే .. ఆ లుక్.. విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ లుక్ ను గుర్తుచేస్తుంది అంటున్నారు. నేడు విజయ్.. చైతన్య రావ్ హీరోగా నటించిన అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ లాంచ్ కు వచ్చాడు. బ్లాక్ కలర్ షర్ట్ .. లూజ్ ట్రాక్ .. క్లీన్ షేవ్.. తీరైన మీసకట్టు.. చెక్కు చెదరని హెయిర్ స్టయిల్ తో కనిపించాడు. సడెన్ గా చూసి డియర్ కామ్రేడ్ లో విజయ్ ను చూసినట్టే ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Virat Kohli: బ్రో.. తెల్లగడ్డం వస్తుంది.. జర చూసుకోరాదే
ఇక ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఏ సినిమా కోసం విజయ్ ఈ లుక్ లోకి మారాడో అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఖుషీ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ ను ఫినిష్ చేసుకుంటుంది. ఇక అందరి అంచనాల ప్రకారం.. ఈ లుక్.. గౌతమ్ తిన్ననూరి సినిమా కోసమే అని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ స్పై గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ షూటింగ్ లోనే విజయ్ పాల్గొంటున్నాడు. అందుకే ఈ లుక్ దానికోసమే అని అభిమానులు అంటున్నారు. ఏదిఏమైనా ఆ లుక్ లో విజయ్ చూడడానికి బాగానే ఉన్నా.. ఆ ప్లాప్ సెంటిమెంట్ ఏమైనా వచ్చేస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. మరి ఈసారి విజయ్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.