2016లో మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘బిచ్చగాడు’ సినిమా రిలీజ్ అయ్యింది. ‘అమ్మ’ సాంగ్ తో ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఈ మూవీ తమిళ్ కన్నా తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లోనే తెలుగు రైట్స్ కొన్న ప్రొడ్యూసర్ కి 10 రేట్ల ప్రాఫిట్ ఇస్తూ 14 కోట్ల షేర్ ని వసూల్ చేసింది బిచ్చగాడు మూవీ. దర్శకుడు శశి తెరకెక్కించిన ఈ సినిమా బ్రాండ్ ని వాడుకుంటూ బిచ్చగాడు 2 చేసాడు విజయ్ ఆంటోనీ. మే 19న ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వచ్చినా కూడా ఈ సీక్వెల్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 2 కోట్లకు పైగా షేర్ ని రాబట్టిన బిచ్చగాడు 2, రెండో రోజు కూడా అదే జోష్ ని మైంటైన్ చేస్తూ కోటిన్నరపై పైగా షేర్ ని వసూల్ చేసింది. ఓవరాల్ గా రెండు రోజుల్లో నాలుగు కోట్ల షేర్ ని బిచ్చగాడు 2 రాబట్టింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ బిజినెస్ 6 కోట్లకి జరిగింది అంటే ఇంకో రెండు కోట్లు కలెక్ట్ చేస్తే బిచ్చగాడు 2 బ్రేక్ ఈవెన్ మార్క్ ని రీచ్ అయినట్లే.
ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే బిచ్చగాడు 2 సినిమా మండే ఎండ్ అయ్యే లోపే బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసేలా ఉంది. తమిళ్ లో బిచ్చగాడు 2కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ తెలుగు రేంజులో ఆదరణ లభించలేదు. అందుకే విజయ్ ఆంటోనీ కూడా తెలుగు మార్కెట్ పై ద్రుష్టి పెట్టి ఇక్కడ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ని చేస్తున్నాడు. మేజర్ సెంటర్స్ లోని థియేటర్స్ కి విజయ్ ఆంటోనీ స్వయంగా వెళ్తూ బిచ్చగాడు 2 సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నాడు. ఈమధ్య కాలంలో రిలీజ్ అయిన స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా సెకండ్ డే సైలెంట్ అయిపోయాయి అలాంటిది బిచ్చగాడు 2కి మిక్స్డ్ రివ్యూస్ తో వస్తున్న కలెక్షన్స్ ని చూస్తుంటే ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.
Team #Bichagadu2 all set for HYDERBAD theatres visit Today!
BLOCKBUSTER HIT 🔥Book your tickets now 🎫 https://t.co/MsgFe15tby 🎟️ https://t.co/KJBZJtP53s 🎟️ @vijayantony@kavyathapar @mrsvijayantony@vijayantonyfilm @saregamasouth @starma@disneyplushstel @gskmedia_pr… pic.twitter.com/yByo0qY4Ws
— Vamsi Kaka (@vamsikaka) May 21, 2023