2024 సంక్రాంతి ఇప్పటికే జామ్ ప్యాక్ అయ్యి ఉంది. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13 సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇవి చాలవన్నట్లు తమిళ్ నుంచి రజినీకాంత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’, శివ కార్తికేయన్ నటిస్తున్న అయలాన్ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకే థియేటర్స్ దొరకడం కష్టం… తీరా సంక్రాంతి సీజన్ వచ్చినప్పుడు సగం సినిమాలు వాయిదా పడతాయి అనుకుంటుంటే కొత్తగా రేస్ లోకి వచ్చాడు విక్టరీ వెంకటేష్. వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో వెంకీ మామ యాక్షన్ మోడ్ లోకి దిగుతున్నాడు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో విక్రమ్ సినిమాలోని కమల్ హాసన్ ని గుర్తు చేసేలా ఉన్న వెంకటేష్ తన సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యాడు.
జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొత్త పోస్టర్ తో అఫీషియల్ అన్నౌన్స్మెంట్ ఇచ్చారు. సంక్రాంతి సీజన్ లో పోటీ ఉన్నా కూడా టాక్ బాగుంటే తమ సినిమాని ఆడియన్స్ ఆదరిస్తారు అనే నమ్మకం మూవీ మేకర్స్ లో ఉంటుంది. ఆ నమ్మకమే సైంధవ్ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెడుతుంది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు అనే ఆలోచన బాగుంది కానీ అసలు థియేటర్స్ దొరుకుతాయా లేదా అనేది ఎవరూ ఆలోచించట్లేదు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సగానికి పైగా థియేటర్స్ ని సొంతం చేసుకోవడం గ్యారెంటీ. మిగిలిన థియేటర్స్ ని హను మాన్, ఈగల్, నా సామీ రంగ, సైంధవ్, VD 13 సినిమాలు పంచుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి సినిమాకి నష్టం కలిగించే పరిణామమే. ఈ విషయాన్ని అలోచించి మేకర్స్ సంక్రాంతి సీజన్ నుంచి వెనక్కి కానీ ముందుకి కానీ వెళ్తారేమో చూడాలి.
Sankranthi ki kaluddhaam ❤️#SaindhavOnJAN13th#SAINDHAV@Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/pR95RoMyXQ
— Venkatesh Daggubati (@VenkyMama) October 5, 2023