Saroja Devi : సీనియర్ హీరోయిన్ సరోజా దేవి కన్నుమూశారు. వందల సినిమాల్లో నటించి ఎవర్ గ్రీన్ అనిపించుకున్న ఆమె.. అనారోగ్యంతో ఈ రోజు మృతి చెందారు. సరోజా దేవి గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియదు. కానీ ఒక 15 ఏళ్లు వెనక్కు వెళ్తే ఆమె గురించి తెలియని వారే ఉండరేమో. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగరావు, ఆ తర్వాత తరంలో శోభన్ బాబు, కృష్ణ లాంటి సూపర్ స్టార్లతో నటించిన అగ్ర హీరోయిన్. ఒకానొక దశలో సౌత్ ఇండస్ట్రీని ఏకధాటిగా ఏలింది. 161 సినిమాల్లో విరామం లేకుండా నటించిన హీరోయిన్ ఆమె. అలాంటి సరోజా దేవికి అసలు నటన అంటేనే ఇష్టం లేదంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది.
Read Also : Ileana : అమ్మకి ఫోన్ చేసి ఏడ్చా.. సినిమా వదిలేయాలని అనుకున్నా
నాకు అసలు నటన అంటేనే ఇష్టం లేదు. నేను చిన్నప్పుడు సన్యాసులను చూసి పెద్దయ్యాక వారిలాగా మారాలని అనుకునేదాన్ని. వారి లైఫ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. నా 13 ఏళ్ల వయసులో కన్నడ నిర్మాత కన్నప్ప భాగవతార్ చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగాను. మా ఇంట్లో వాళ్లు సినిమాల్లో నటించాలని మొదట్లో ఒప్పించడం వల్లే నటించగలిగాను. ఆ తర్వాత నటన నాకు ప్రాణం అయింది. పెళ్లయ్యాక నా భర్త కూడా ఎంకరేజ్ చేశారు. ఇన్నేళ్ల నా కెరీర్ లో ఒక్క గాసిప్ లేకుండా బతకడం నిజంగా నేను చేసుకున్న పుణ్యం. అదే నన్ను ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు సరోజా దేవి. సరోజా దేవి మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
Read Also : Live-in Relationship: భార్యతో గొడవ పడుతుందని.. సహజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడి దారుణం