Ramam : టాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో పేరు తెచ్చుకున్న చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనేపూడి తాజాగా మరో భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించారు. శ్రీరామ నవమి సందర్భంగా వైవిధ్యభరితమైన కథాంశంతో రాముడి పాత్ర స్ఫూర్తితో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. దీనికి ‘రామం’ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘ది రైజ్ ఆఫ్ అకిరా’ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద రాలేని కథాంశంతో పాటు సరికొత్తగా సినిమాను తీస్తున్నట్టు తెలిపారు. ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తీస్తున్నామని స్పష్టం చేశారు.
Read Also : MK Stalin: ప్రధాని మోడీ కార్యక్రమానికి స్టాలిన్ గైర్హాజరు.. కారణం ఇదే..
పలువురు డైరెక్టర్ల వద్ద పనిచేసిన లోకమాన్యను ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు వివరించారు. ఈ మూవీకి ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు పనిచేస్తున్నట్టు ఆయన వివరించారు. భారతీయులకు అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి రోజున ‘రామం’ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వేను దోనేపూడి మాట్లాడుతూ.. ‘ధర్మం, న్యాయంవైపే నిలబడ్డ ఆ శ్రీరాముడి మూర్తి మత్వాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తున్నామని వివరించారు. రాముడి పాత్రను ఆధారంగా చేసుకుని నేటి జనరేషన్ కు తగ్గట్టు ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు వేణు. త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేస్తామన్నారు. ఈ మూవీలో టాలీవుడ్ రైజింగ్ స్టార్ హీరోగా నటిస్తారని వివరించారు.